Sputnik Lite: ‘స్పుత్నిక్ లైట్’ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

  • స్పుత్నిక్ లైట్‌ను అభివృద్ధి చేసిన రష్యా ఆర్‌డీఐఎఫ్
  • ఆర్‌డీఐఎఫ్‌తో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం
  • త్వరలోనే అందుబాటులోకి సింగిల్ షాట్ టీకా
Dr Reddys gets DCGI nod to conduct phase 3 Sputnik Light trials

రష్యా అభివృద్ధి చేసిన కరోనా సింగిల్ డోసు టీకా స్పుత్నిక్ లైట్‌‌కు మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతినిచ్చింది. ఈ టీకాను మన దేశంలో విడుదల చేసేందుకు రష్యా ఆర్‌డీఐఎఫ్‌తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఒప్పందం కుదుర్చుకుంది.

తాజాగా, ఈ టీకా మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి లభించడంతో టీకా విడుదల మార్గం సుగమం అయినట్టే. స్పుత్నిక్ లైట్ 79.4 శాతం ప్రభావశీలత చూపించినట్టు ఆర్‌డీఐఎఫ్ గతంలో ప్రకటించింది. త్వరలో నిర్వహించే మూడో దశ పరీక్షల్లోనూ సానుకూల ఫలితాలు లభిస్తే టీకాను భారత్‌లో విక్రయించేందుకు లైన్ క్లియర్ అవుతుంది.

More Telugu News