UN: యూఎన్ సమావేశంలో పాక్‌కు దిమ్మతిరిగే బదులిచ్చిన భారత్

  • కశ్మీర్ అంశం లేవనెత్తిన పాకిస్థాన్
  • ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్‌పై కూడా భారత్ గుస్సా
  • విఫలమైన దేశం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన దుస్థితి లేదన్న భారత్
India hits out at Pakistan in UN meeting

ఐక్యరాజ్య సమితి (యూఎన్) సమావేశంలో కశ్మీర్ అంశం లేవనెత్తిన పాకిస్థాన్‌కు భారత్ నుంచి దిమ్మతిరిగే బదులు లభించింది. పాక్ బుద్ధిని తప్పుబట్టిన భారత్.. ఒక విఫలమైన దేశం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన దుస్థితిలో తాము లేమని స్పష్టం చేసింది.

పాకిస్థాన్‌తోపాటు ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ)పై కూడా భారత్ స్పందించింది. జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాకిస్థాన్ పాల్గొంది. ఈ సందర్భంగానే కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. ఈ కార్యక్రమంలో భారత ప్రతినిధిగా పవన్ బాధే పాల్గొన్నారు. జెనీవాలో భారత్ మిషన్‌కు ఆయన తొలి సెక్రటరీగా ఉన్నారు.

యూఎన్ సమావేశంలో పాకిస్థాన్ తీరును ఆయన ఖండించారు. ఉగ్రవాదానికి, మానవ హక్కుల ఉల్లంఘనకు కేంద్రబిందువుగా పాకిస్థాన్ ఉందంటూ పవన్ మండిపడ్డారు. ఇలా అన్నిరంగాల్లో విఫలమైన దేశం నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన దుస్థితిలో భారత్ లేదని స్పష్టంచేశారు.

More Telugu News