తెలంగాణలో కరోనా అప్డేట్స్ ఇవిగో!

15-09-2021 Wed 20:50
  • 24 గంటల్లో 324 కేసుల నమోదు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 79 కేసుల నిర్ధారణ
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,325
Telangana registers 324 new Corona cases in 24 hours

తెలంగాణలో గత 24 గంటల్లో 324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో 79 కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. ఇదే సమయంలో 280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,62,526కి చేరుకుంది.

ఇక మొత్తం 6,53,302 మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా 3,899 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 73,323 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.60 శాతంగా ఉందని, మరణాల రేటు 0.58 శాతంగా ఉందని తెలంగాణ ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,325 యాక్టివ్ కేసులు ఉన్నాయి.