Sonu Sood: సోను సూద్ పై ఐటీ దాడులు

IT Department Raids 6 Places Linked Sonu Sood
  • ఆదాయపు పన్ను ఎగ్గొట్టారనే ఆరోపణలు
  • ముంబై, లక్నోలలో ఆరు చోట్ల సోదాలు
  • ఇటీవలే కేజ్రీవాల్ ను కలిసిన సోను
ప్రముఖ సినీ నటుడు సోను సూద్ పై ఐటీ శాఖ దృష్టి సారించింది. ఆదాయపు పన్నును ఎగ్గొట్టారనే కారణాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముంబై, లక్నోల్లోని దాదాపు ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ముంబైలోని ఆయన నివాసంలో కూడా సోదాలు జరిగినట్టు సమాచారం. సోను సూద్ కంపెనీకి, లక్నోలోని ఓ రియలెస్టేట్ సంస్థకు మధ్య ఇటీవల ఒక డీల్ జరిగింది. ఈ డీల్ అంశంలో ఆదాయపు పన్నును ఎగ్గొట్టారని ఐటీ శాఖ చెపుతోంది.

మరోవైపు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సోను సూద్ హైప్రొఫైల్ మీటింగ్ జరిగిన రోజుల వ్యవధిలోనే ఐటీ సోదాలు జరగడం గమనార్హం. ఢిల్లీ ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న 'దేశ్ కా మెంటార్' పథకానికి బ్రాండ్ అంబాసడర్ గా సోను సూద్ ను ఆ సమావేశంలో కేజ్రీవాల్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీలోకి సోను చేరుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే, తనకు అలాంటి ఆలోచన లేదని ఆ తర్వాత సోను వివరణ ఇచ్చారు. 48 ఏళ్ల సోను సూద్ కరోనా కష్ట సమయంలో ఎంతో మంది పాలిట ఆపద్బాంధవుడిగా నిలిచారు. ఎంతో మందికి ఎన్నో విధాలుగా సాయాన్ని అందిస్తూ  రియల్ హీరో అనిపించుకున్నారు. సోనుకు చెందిన ప్రాంతాలపై ఐటీ దాడులు జరిగాయనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Sonu Sood
Tollywood
Bollywood
IT Raids

More Telugu News