'రిపబ్లిక్' మూవీ విడుదల వాయిదా?

15-09-2021 Wed 17:26
  • రాజకీయాల నేపథ్యంలో సాగే కథ
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
  • విడుదల కావలసిన తేదీ అక్టోబర్ 1
  • త్వరలో రానున్న స్పష్టత
Republic movie release date postponed

సాయితేజ్ హీరోగా దర్శకుడు దేవ కట్టా 'రిపబ్లిక్' సినిమాను రూపొందించాడు. భగవాన్ - పుల్లారావు నిర్మించిన ఈ సినిమా, రాజకీయాల నేపథ్యంలో కొనసాగుతుంది. అవినీతి రాజకీయ నాయకులను ఎదుర్కునే నిజాయతీపరుడైన కలెక్టర్ గా ఈ సినిమాలో సాయితేజ్ కనిపించనున్నాడు.

ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఇటీవల సాయితేజ్ రోడ్డు ప్రమాదానికి గురై, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. సాయితేజ్ కోలుకుంటున్నాడు .. కానీ ఇంత తక్కువ వ్యవధిలో ప్రమోషన్స్ లో పాల్గొనకపోవచ్చును.

అందువలన మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో జగపతిబాబు .. రమ్యకృష్ణ కీలకమైన పాత్రలను పోషించారు. ముఖ్యంగా రమ్యకృష్ణ పోషించిన పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని చెబుతున్నారు.