'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' నుంచి లెహరాయి సాంగ్ రిలీజ్!

15-09-2021 Wed 17:04
  • హీరో హీరోయిన్లుగా అఖిల్, పూజ హెగ్డే  
  • బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం 
  • ముఖ్యమైన పాత్రలలో ఈషా రెబ్బా, ఆమని 
  • అక్టోబర్ 8వ తేదీన విడుదల  
Most Eligible Bachelor lyrical video release

అఖిల్ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా, చిత్రీకరణను పూర్తిచేసుకుని చాలా కాలమైంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా, అక్టోబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

'లెహరాయి ... లెహరాయి గుండె వెచ్చనాయే ఊహలెగిరాయి. లెహరాయి లెహరాయి గోరువెచ్చనైన ఊసులదిరాయి ..' అంటూ ఈ పాట సాగుతోంది. అఖిల్ - పూజ హెగ్డేపై ఈ పాటను చిత్రీకరించారు. గోపీసుందర్ అందించిన బాణీ .. శ్రీమణి సాహిత్యం .. సిద్ శ్రీరామ్ గానం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈషారెబ్బా మరో కథానాయికగా కనిపించగా, ఆమని ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో అఖిల్ ఉన్నాడు.