ఇద్దరు ఐఏఎస్ అధికారులకు శిక్ష విధించిన ఏపీ హైకోర్టు

15-09-2021 Wed 16:27
  • పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలకు హైకోర్టు శిక్ష
  • పూనంకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
  • ఈ నెల 29న శిక్షను ఖరారు చేయనున్న హైకోర్టు
Two AP IAS officers sentenced by AP HC on court contempt

ఇద్దరు ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరి అనే ఇద్దరు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు శిక్షను విధించింది. కోర్టుకు హాజరు కాలేదనే కారణంతో పూనం మాలకొండయ్యకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

సెరికల్చర్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గతంలో కోర్టును కోరారు. వారిని రెగ్యులరైజ్ చేయాలని గత ఏడాది ఫిబ్రవరి 28న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఐఏఎస్ లకు కోర్టు శిక్షను విధించింది. అయితే శిక్షాకాలం ఎంత అనే విషయాన్ని ఈ నెల 29న కోర్టు నిర్ధారించనుంది.