Sensex: భారీ లాభాలతో దూసుకుపోయిన మార్కెట్లు

  • 476 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 139 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 7 శాతానికి పైగా లాభపడ్డ నిఫ్టీ
Makets ends at record heights

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు రికార్డు స్థాయుల్లో ముగిశాయి. ఇన్ఫోసిస్, ఎస్బీఐ, టీసీఎస్, భారతి ఎయిర్ టెల్, ఎన్టీపీసీ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు బాగా రాణించాయి. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 530 పాయింట్ల వరకు పెరిగింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 476 పాయింట్లు లాభపడి 58,723కి చేరుకుంది. నిప్టీ 139 పాయింట్లు పెరిగి 17,519 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (7.16%), భారతి ఎయిర్ టెల్ (4.53%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.86%), టైటాన్ కంపెనీ (2.83%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.49%).

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-0.38%), ఏసియన్ పెయింట్స్ (-0.31%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.27%), నెస్లే ఇండియా (-0.16%), సన్ ఫార్మా (-0.15%).

More Telugu News