లాలూప్రసాద్ కుమారుడి కంపెనీకి టోకరా.. డబ్బుతో ఉద్యోగి పరార్

15-09-2021 Wed 15:53
  • కొన్ని నెలల క్రితం అగరబత్తీల వ్యాపారాన్ని ప్రారంభించిన తేజ్ ప్రతాప్ యాదవ్
  • రూ. 71 వేల నగదు తీసుకుని ఉడాయించిన ఉద్యోగి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన తేజ్ ప్రతాప్
Employee in RJDs Tej Pratap Yadav company ran away with money

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, ఆ పార్టీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ కొన్ని నెలల క్రితం అగరబత్తీల వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆర్ఎల్ అగరబత్తీ పేరిట ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. అయితే, అందులో పని చేస్తున్న ఉద్యోగి తేజ్ ప్రతాప్ ను బురిడీ కొట్టించాడు. రూ. 71 వేల నగదు తీసుకుని ఉడాయించాడు.

ఈ ఘటనపై ఎస్ కే పురి పోలీస్ స్టేషన్లో తేజ్ ప్రతాప్ యాదవ్ ఫిర్యాదు చేశారు. తన కంపెనీలో మార్కెటింగ్ వ్యవహారాలు చూసే ఆశిష్ రంజన్ అనే వ్యక్తి రూ. 71 వేలు తీసుకుని పరారయ్యాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రంజన్ కోసం గాలింపు చేపట్టారు. రంజన్ పాట్నాకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.