సీబీఐ కోర్టులో జగన్ కు ఊరట.. బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ ను కొట్టేసిన కోర్టు!

15-09-2021 Wed 14:50
  • బెయిల్ రద్దు చేయాలంటూ రఘురాజు పిటిషన్
  • ఈరోజు తీర్పును వెలువరించిన సీబీఐ కోర్టు
  • కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠను రేపిన పిటిషన్లు
Jagan gets relief in CBI Court

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసింది. జగన్, విజయసాయి ఇద్దరి బెయిల్ పిటిషన్లను రద్దు చేయాలంటూ రఘురాజు పిటిషన్లు వేశారు.

ఈ పిటిషన్లపై జులై ఆఖరులో వాదనలు ముగిశాయి. అయితే తీర్పును రిజర్వ్ లో ఉంచిన కోర్టు... ఈరోజు తీర్పును వెలువరించింది. రఘురాజు పిటిషన్లను డిస్మిస్ చేసింది. దీంతో, గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠను రేపిన అంశానికి ముగింపు కార్డు పడింది. సీబీఐ కోర్టు తీర్పుతో వైసీపీ శిబిరంలో సంతోషకర వాతావరణం నెలకొంది.