Raghu Rama Krishna Raju: జ‌గ‌న్, విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ల‌ బ‌దిలీకి హైకోర్టు నిరాక‌ర‌ణ‌.. రఘురామకృష్ణరాజు పిటిషన్ కొట్టివేత

high court refuses raghurama petition
  • సీబీఐ కోర్టు నుంచి మ‌రో కోర్టుకు బ‌దిలీ చేయాల‌న్న ర‌ఘురామ పిటిష‌న్ తిరస్కరణ  
  • సీబీఐ కోర్టులో బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ల‌పై కాసేప‌ట్లో తీర్పు
  • సర్వ‌త్రా ఉత్కంఠ‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్, వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ల‌ బ‌దిలీకి తెలంగాణ‌ హైకోర్టు నిరాక‌రించింది. సీబీఐ కోర్టు నుంచి మ‌రో కోర్టుకు బ‌దిలీ చేయాల‌ని వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు వేసిన‌ పిటిష‌న్ ను కొట్టివేసింది. మ‌రోవైపు, సీబీఐ కోర్టులో జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాలన్న పిటిష‌న్ల‌పై కాసేప‌ట్లో తీర్పు వెలువ‌డ‌నుంది. దీంతో సర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

అక్రమాస్తుల కేసులో జ‌గ‌న్, విజ‌యసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ కొన్ని రోజుల క్రితం వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్లు దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ బెయిల్ రద్దు పిటిషన్లపైనే సీబీఐ కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. ఈ నేప‌థ్యంలోనే సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించకుండా స్టే ఇవ్వాల‌ని, బెయిల్‌ రద్దు పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలని రఘురామ నిన్న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ రోజు హైకోర్టు దాన్ని కొట్టి వేసింది.
Raghu Rama Krishna Raju
YSRCP
Andhra Pradesh
Jagan
Vijay Sai Reddy

More Telugu News