‘సాక్షి’పై కోర్టు ధిక్కరణ కేసు.. విచారణ తెలంగాణ హైకోర్టుకు బదిలీ

15-09-2021 Wed 11:45
  • జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టేశారంటూ 'సాక్షి'లో కథనం
  • కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసిన రఘురామ
  • మరికాసేపట్లో జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై తీర్పు 
CBI Court Transfers Contempt Case On Sakshi To Telangana High Court

తీర్పు రాకముందే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టేశారంటూ సాక్షిలో వార్త ప్రచురించడంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై సీబీఐ కోర్టు స్పందించింది. ఆ పిటిషన్ విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది.

ఇదిలా ఉంటే, మరికాసేపట్లో జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ ను రద్దు చేయాలంటూ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు తీర్పును వెలువరించనుంది. మరోపక్క, ఆ కేసును సీబీఐ కోర్టు నుంచి వేరే కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ రఘురాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.