చివరి షెడ్యూల్ షూటింగు మొదలెట్టిన 'సామాన్యుడు'

15-09-2021 Wed 10:34
  • విశాల్ నుంచి 'సామాన్యుడు'
  • యాక్షన్ ప్రధానంగా సాగే కథ
  • కథానాయికగా డింపుల్ హయతి
  • డిసెంబర్లో సినిమా విడుదల
Samanyudu movie update

మొదటి నుంచి కూడా విశాల్ తన సినిమాకి .. సినిమాకి మధ్య పెద్దగా గ్యాప్ ఇవ్వడు. తాను చేసిన సినిమా హిట్ అయినా .. ఫ్లాప్ అయినా, ఆ తరువాత సినిమా అంతే స్పీడుగా పట్టాలెక్కిస్తాడు. తమిళనాట మాత్రమే కాదు తెలుగులోను ఆయనకి మంచి మాస్ ఇమేజ్ ఉంది. అందుకు తగినట్టుగానే ఆయన తన కథల్లో మాస్ అంశాలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటాడు.

ఈ క్రమంలో ఆయన తాజా చిత్రంగా 'సామాన్యుడు' రూపొందుతోంది. విశాల్ సొంత బ్యానర్ పై ఈ సినిమా నిర్మితమవుతోంది. శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చాలా వేగంగా షూటింగు జరుపుకుంటోంది. నిన్నటి నుంచి ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ముఖ్యమైన పాత్రధారుల కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. డింపుల్ హయతి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, యోగిబాబు ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. డిసెంబర్లో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.