దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

15-09-2021 Wed 09:58
  • కొత్తగా 27,176 క‌రోనా కేసులు
  • కేసుల సంఖ్య మొత్తం 3,33,16,755
  • మ‌రో 284 మంది మృతి
  • మొత్తం మృతుల సంఖ్య 4,43,497
corona bulletin in inida

దేశంలో నిన్న కొత్తగా 27,176 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,33,16,755కి చేరింది. అలాగే, నిన్న 38,012 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 284 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,43,497కి పెరిగింది.  

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,25,22,171 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 3,51,087మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 61,15,690 వ్యాక్సిన్ డోసుల‌ను ప్ర‌జ‌ల‌కు వేశారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 75,89,12,277 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. దేశంలోనే అత్య‌ధికంగా కేరళలో 15,876 కొత్త‌ కేసులు న‌మోద‌య్యాయి. నిన్న 129 మంది మృతి చెందారు.