JEE Main: జేఈఈ మెయిన్ ఫలితాల వెల్లడి.. అదరగొట్టిన తెలుగు విద్యార్థులు

  • అర్ధరాత్రి దాటిన తర్వాత ఫలితాల విడుదల
  • నలుగురు ఏపీ, ఇద్దరు తెలంగాణ విద్యార్థులకు టాప్ ర్యాంక్
  • 44 మందికి 100 పర్సంటైల్
  • 18 మందికి మొదటి ర్యాంకు
JEE Main Result 2021 released

జేఈఈ మెయిన్ (నాలుగో విడత) పరీక్ష ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. గత అర్ధరాత్రి జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ఫలితాలను విడుదల చేసింది. 44 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, 18 మంది విద్యార్థులు మొదటి ర్యాంకు సాధించారు.

మరోవైపు, వీటిలో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు.. కొమ్మ శరణ్య, జోస్యుల వెంకటాదిత్య, ఏపీ నుంచి నలుగురు విద్యార్థులు దుగ్గినేని వెంకటన ఫణీష్, పసల వీరశివ, కంచనపల్లి రాహుల్ నాయుడు, కర్నం లోకేశ్ టాప్ ర్యాంకుతో మెరిశారు.

కాగా, అర్ధరాత్రి వేళ మెయిన్ ఫలితాలు విడుదల చేస్తుండడంపై ఎన్‌టీఏపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ఏటీ గత మూడేళ్లుగా ఇదే పనిచేస్తోందని విమర్శిస్తున్నారు. కాగా, ఫలితాల విడుదల జాప్యానికి, సీబీఐ విచారణకు సంబంధం లేదని, సిబ్బంది అనారోగ్యానికి గురికావడం వల్లే జాప్యమైందని ఎన్ఏటీ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి తెలిపారు.

More Telugu News