సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

15-09-2021 Wed 07:27
  • సెన్సార్ పూర్తిచేసుకున్న 'లవ్ స్టోరీ'
  • మెగా హీరోను కలసిన విష్ణువర్ధన్
  • మలయాళ సినిమాలో అరవింద్ స్వామి  
Love Story cleared censor formalities

*  నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'లవ్ స్టోరీ' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు నిన్న పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి దీనికి U/A సర్టిఫికెట్ లభించింది. ఈ చిత్రాన్ని ఈ నెల 24న థియేటర్లలో విడుదల చేస్తున్నారు.  
*  ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్ పై 'షేర్ షా' వంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు విష్ణు వర్ధన్ తన తదుపరి చిత్రం కోసం మెగా హీరో వైష్ణవ్ తేజ్ ని సంప్రదించినట్టు తెలుస్తోంది. గతంలో పవన్ కల్యాణ్ తో విష్ణువర్ధన్ 'పంజా' చిత్రాన్ని రూపొందించిన సంగతి విదితమే.
*  ప్రముఖ నటుడు అరవింద్ స్వామి సుమారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఓ మలయాళ సినిమాలో నటిస్తున్నారు. తమిళ నటుడు ఆర్య నిర్మిస్తున్న 'ఓట్టు' మలయాళ సినిమాలో కీలక పాత్రలో అరవింద్ స్వామి నటించనున్నట్టు సమాచారం. కాగా, తాజాగా విడుదలైన 'తలైవి' సినిమాలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటించిన సంగతి తెలిసిందే. ఆయన పాత్ర పోషణకు మంచి పేరు వస్తోంది.