హుజూరాబాద్ నివురుగప్పిన నిప్పులా ఉంది.. 2006 రిపీట్ అవుతుంది: ఈటల

14-09-2021 Tue 18:06
  • హుజూరాబాద్ లో దుర్మార్గాలు, దురాగతాలు చెల్లవు
  • ఎవరికి భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినం జరపడం లేదు?
  • చాకలి ఐలమ్మ ప్రజల కోసం ప్రాణం అర్పించారు
2006 repeats in Huzurabad says Etela Rajender

హుజూరాబాద్ నియోజకవర్గం నివురుగప్పిన నిప్పులా ఉందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. దౌర్జన్యాలు, దుర్మార్గాలు, దురాగతాలు హుజూరాబాద్ లో చెల్లవని వ్యాఖ్యానించారు. చాకలి ఐలమ్మ ముఖ్యమంత్రి కాదని... అయినప్పటికీ ప్రజల కోసం ప్రాణం అర్పించారని చెప్పారు.

ఈ ప్రపంచంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోలేని ఏకైక జాతి తెలంగాణ జాతేనని అన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. ఎవరికి భయపడి విమోచన దినాన్ని జరపడం లేదో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు చరిత్ర వీరులను, చరిత్ర హీనులను గుర్తుంచుకుంటారని... హిట్లర్ చరిత్ర హీనుడైతే, మన శ్రీకాంతాచారి చరిత్ర వీరుడని అన్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న హుజూరాబాద్ లో 2006 ఉపఎన్నిక హిస్టరీ రిపీట్ అవుతుందని చెప్పారు.