నేను చెప్పినవి తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కేటీఆర్

14-09-2021 Tue 17:35
  • బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్
  • కేంద్రం ఇచ్చినదానిపై చర్చకు రావాలన్న కేటీఆర్
  • ఎవరి పైసలతో ఎవరు కులుకుతున్నారంటూ ఆగ్రహం
  • కేంద్రం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని వెల్లడి
KTR challenges Telangana BJP Chief Bandi Sanjay

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. కేంద్రం ఇచ్చిన నిధులపై బండి సంజయ్ చర్చకు రావాలని అన్నారు. నేను చెప్పినవి తప్పు అయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా... మీరు చెప్పినవి తప్పు అయితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? అని వ్యాఖ్యానించారు.

గత ఆరున్నరేళ్లలో కేంద్రానికి పన్నుల రూపంలో రూ.2.72 లక్షల కోట్లు చెల్లించామని కేటీఆర్ వెల్లడించారు. కేంద్రం నుంచి ఫైనాన్స్ కమిషన్ రూపంలో రూ.1.42 లక్షల కోట్లు ఇచ్చారని తెలిపారు. ఎవరి పైసలతో ఎవరు కులుకుతున్నారో మీరే చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని స్పష్టం చేశారు. సొల్లు కబుర్లు, చిల్లర మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.