Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు... వివరణ ఇచ్చిన అధ్యక్ష కార్యాలయం

Russian president Vladimir Putin went isolation
  • పుతిన్ కరోనా బారినపడ్డారంటూ ప్రచారం
  • ఖండించిన క్రెమ్లిన్ ప్రతినిధి
  • పుతిన్ బృందంలో కొందరికి కరోనా సోకిందని వెల్లడి
  • పుతిన్ ఐసోలేషన్ లోకి వెళ్లారని స్పష్టీకరణ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కరోనా బారినపడ్డారంటూ జరుగుతున్న ప్రచారంపై అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ స్పందించింది. పుతిన్ బృందంలో కరోనా కలకలం రేగిందని, కొందరికి కరోనా సోకడంతో పుతిన్ ఐసోలేషన్ లోకి వెళ్లారని వెల్లడించింది. అంతేతప్ప పుతిన్ అనారోగ్యం పాలయ్యారంటూ వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేసింది. పుతిన్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపింది. పుతిన్ కు కూడా కరోనా టెస్టు చేశారని వివరించిన క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్, ఆ టెస్టు ఫలితం ఏంటన్నది మాత్రం వెల్లడించలేదు.

ఇదిలావుంచితే, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ వారంలో తజకిస్థాన్ రాజధాని దుషాంబేలో ప్రాంతీయ సదస్సుకు హాజరవ్వాల్సి ఉంది. అయితే తాను రాలేకపోతున్నానని తజకిస్థాన్ అధ్యక్షుడు ఎమోమలి రఖ్మోన్ కు పుతిన్ ఫోన్ ద్వారా తెలియజేశారు. కాగా, పుతిన్ నిన్న సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ ను, టోక్యో పారాలింపిక్స్ లో పాల్గొని తిరిగొచ్చిన రష్యా అథ్లెట్లను కలిశారు.
Vladimir Putin
Russia
Corona Virus
Kremlin

More Telugu News