పాటల చిత్రీకరణలో 'అఖండ'

14-09-2021 Tue 15:57
  • ముగింపు దశలో 'అఖండ'
  • గోవాలో పాట చిత్రీకరణ
  • నెలాఖరులో మరో పాట షూటింగ్
  • దీపావళికి రిలీజ్ చేసే ఆలోచన  
Akhanda movie update

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా సినిమా ముగింపుదశకు చేరుకుంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగు ప్రస్తుతం 'గోవా'లో జరుగుతోంది. అక్కడ ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. నిన్నటి నుంచి ఈ పాట చిత్రీకరణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ తరువాత ఈ నెలాఖరులో మరో పాటను ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు.  

ఈ రెండు పాటలతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాను దీపావళికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, పూర్ణ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాతో బాలకృష్ణ - బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.