లాభాల్లో ముగిసిన మార్కెట్లు

14-09-2021 Tue 15:41
  • ఆద్యంతం లాభాల్లో కొనసాగిన మార్కెట్లు
  • 104 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 27 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే కొనసాగాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 104 పాయింట్లు పెరిగి 58,247కి చేరుకుంది. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 17,382 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.02%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.13%), బజాజ్ ఆటో (1.62%), ఎల్ అండ్ టీ (1.51%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.45%).

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-0.97%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.87%), టాటా స్టీల్ (-0.83%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-0.74%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.63%).