ధర్నాలో స్పృహ కోల్పోయిన ఆర్.కృష్ణయ్య.. ఆసుపత్రికి తరలింపు

14-09-2021 Tue 15:27
  • సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం వద్ద ధర్నా
  • గెస్ట్ టీచర్లకు మద్దతు తెలుపుతూ ధర్నా
  • అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయిన కృష్ణయ్య
R Krishnaiah unconscious during dharna

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అస్వస్థతకు గురయ్యారు. ఓ ధర్నాలో పాల్గొన్న ఆయన స్పృహ తప్పి పడిపోయారు. వివరాల్లోకి వెళ్తే, మోడల్ స్కూళ్లలో పని చేస్తున్న గెస్ట్ టీచర్లకు మద్దతు తెలుపుతూ హైదరాబాదులోని బషీర్ బాగ్ లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం వద్ద బీసీ సంక్షేమ సంఘం ధర్నా నిర్వహించింది.

ఈ ధర్నాలో ఆర్.కృష్ణయ్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అస్వస్థతకు గురైన కృష్ణయ్య స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆయనను హుటాహుటిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.