రూ. 121 కోట్ల అవినీతి అంటున్నారు.. 121 పైసలు కూడా నిరూపించలేరు: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి

14-09-2021 Tue 14:36
  • టీడీపీ హయాంలో 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని జగన్ బురద చల్లారు
  • ఏ ఒక్కదాన్ని నిరూపించలేకపోయారు
  • ఇప్పుడు ఫైబర్ నెట్ పై బురద చల్లే  కార్యక్రమం చేపట్టారు
YSRCP can not prove even 121 paise corruption says Pattabhi

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై బురద చల్లే కార్యక్రమానికి జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. సీఐడీని గుప్పిట్లో పెట్టుకుని ఆడించాలనుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ పాలనలో రూ. 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ బురద చల్లిన జగన్ రెడ్డి... ఏ ఒక్కదాన్ని నిరూపించలేకపోయారని అన్నారు. దీంతో ఆయన అసహనానికి గురవుతున్నారని... చివరకు ఫైబర్ నెట్ పై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫైబర్ నెట్ లో రూ. 121 కోట్ల అవినీతి జరిగిందని గౌతమ్ రెడ్డి అంటున్నారని... 121 పైసల అవినీతిని కూడా నిరూపించలేరని ఎద్దేవా చేశారు.