Prime Minister: డబుల్​ ఇంజన్​ సర్కార్​ తో డబుల్​ లాభాలు.. యూపీ సీఎం యోగిపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం

  • దేశాభివృద్ధికి మార్గ నిర్దేశనం
  • ఒకప్పుడు రాష్ట్రాన్ని గూండాలు పాలించేవారు
  • ఆ అవినీతి పాలనను ప్రజలు మరచిపోలేరు
Modi Praises UP CM Yogi Adityanath

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘డబుల్ ఇంజన్ సర్కార్ తో డబుల్ లాభాలు’ ఉంటాయనేందుకు యూపీనే ఉదాహరణ అన్నారు. అలీఘర్ లో ఇవాళ రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్సిటీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు దేశాభివృద్ధికి యూపీ అడ్డంకి అన్న భావన ఉండేదని, కానీ, ఇప్పుడు అభివృద్ధికి మార్గనిర్దేశనం చేస్తోందని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదార్లకు యూపీ గమ్యస్థానంగా మారిందన్నారు. మంచి వాతావరణం కల్పించినప్పుడు, అవసరమైన వనరులను కల్పించినప్పుడే ఇలాంటివి సాధ్యమవుతాయని అన్నారు.

ఒకప్పుడు రాష్ట్రాన్ని గూండాలు పాలించేవారని, వారిదంతా అవినీతి పాలన అని మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్, మాయావతిలను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు దోపిడీదారులు, మాఫియా లీడర్లంతా కటకటాల వెనక ఊచలు లెక్కిస్తున్నారన్నారు. ఒకప్పటి పాలనలో జరిగిన కుంభకోణాలను, అవినీతి నేతలకు కీలక పదవులు కట్టబెట్టడం వంటి వాటిని ప్రజలు ఎన్నటికీ మరచిపోరని అన్నారు. ఇప్పుడు రాష్ట్రాభివృద్ధి కోసం యోగి ప్రభుత్వం అహరహం శ్రమిస్తోందని మోదీ కొనియాడారు.

More Telugu News