JIO: ఇక జియో నుంచి ల్యాప్​ టాప్​ కూడా!

  • మూడు రకాల ల్యాప్ టాప్ లను తీసుకొస్తున్న సంస్థ
  • ఇప్పటికే బీఐఎస్ సర్టిఫికెట్లు జారీ
  • జియో, మైక్రోసాఫ్ట్ యాప్స్ ముందుగానే లోడింగ్
JIO To Bring Laptops Already Receives BIS Certificates

ఇప్పటిదాకా ఫోన్ల మార్కెట్ కే పరిమితమైన జియో.. ఇప్పుడు ల్యాప్ టాప్లనూ మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. మూడు రకాల ల్యాప్ టాప్ లు అతి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. వాటికి సంబంధించి ఇప్పటికే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫికెట్లు కూడా వచ్చాయని సమాచారం.

‘జియోబుక్’గా మార్కెట్ లోకి తీసుకొస్తున్న ఈ ల్యాప్ టాప్ లు 4జీ ఎల్టీఈ కనెక్టివిటీతో వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో 4 జీబీ ర్యామ్ సామర్థ్యంతో ల్యాప్ టాప్ లు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎన్ బీ1118క్యూఎండబ్ల్యూ, ఎన్ బీ1148క్యూఎండబ్ల్యూ, ఎన్ బీ 1112ఎంఎం అనే మూడు రకాల ల్యాప్ టాప్ లను జియో లాంచ్ చేయనుందని అంటున్నారు.

వాటన్నింటిలోనూ జియో స్టోర్, జియోమీట్, జియో పేజెస్ వంటి యాప్స్ ను ముందే లోడ్ చేసి పెడతారని సమాచారం. మైక్రోసాఫ్ట్ టీమ్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వంటి వాటినీ ముందే లోడ్ చేసి పెట్టనున్నారు. అయితే, ల్యాప్ టాప్ ధర ఎంత ఉంటుంది? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న దానిపై మాత్రం సరైన స్పష్టత లేదు.

More Telugu News