ప్రివిలేజ్ కమిటీ ముందు విచార‌ణ‌కు హాజ‌రైన‌ అచ్చెన్నాయుడు

14-09-2021 Tue 13:11
  • ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేనిపై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఆరోప‌ణ‌
  • క‌మిటీ ఛైర్మన్‌ కాకాణి గోవర్ధ‌న్ రెడ్డి అధ్యక్షతన భేటీ
  • ఇటీవ‌లే అచ్చెన్నాయుడికి నోటీసులు  
atchennaidu attends before privileges committee

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేనిపై టీడీపీ నేత‌ అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఈ రోజు ప్రివిలేజ్ కమిటీ విచార‌ణ జ‌రిపింది. ఆ క‌మిటీ ఛైర్మన్‌ కాకాణి గోవర్ధ‌న్ రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన భేటీకి అచ్చెన్నాయుడు హాజ‌ర‌య్యారు.

ఇటీవ‌లే అచ్చెన్నాయుడికి నోటీసులు అంద‌డంతో ఆయ‌న ఈ విచార‌ణ‌లో పాల్గొన్నారు. కాగా, మరికొంతమంది టీడీపీ నేతలకు కూడా ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. వారిని కూడా విచారించే అవ‌కాశం ఉంది. గత నెలలో జరిగిన ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి అచ్చెన్నాయుడు హాజ‌రుకాలేదు. దీంతో కమిటీ ఈ రోజు మ‌రోసారి స‌మావేశం కావ‌డంతో ఆయ‌న హాజ‌రయ్యారు.