సీనియ‌ర్ సినీ న‌టుడు కృష్ణంరాజు ఆరోగ్యంపై ఆయ‌న కుటుంబ స‌భ్యుల ప్ర‌క‌ట‌న‌

14-09-2021 Tue 12:53
  • కృష్ణంరాజు ఆరోగ్యం బాగుంది
  • సాధార‌ణ వైద్య ప‌రీక్ష‌ల కోస‌మే ఆసుప‌త్రికి వెళ్లాం
  • సాయితేజ్ ఆరోగ్య ప‌రిస్థితిని కూడా కృష్ణంరాజు తెలుసుకున్నారు
  • సాయితేజ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కృష్ణంరాజు ఆకాంక్షించారు
 krinam raju family members on his health

సీనియ‌ర్ సినీ న‌టుడు కృష్ణంరాజు ఆరోగ్యం బాగోలేదని, హైదరాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రిలో ఆయ‌న చికిత్స తీసుకుంటున్నార‌ని ఇటీవల ప్రచారం జరుగుతోంది. కృష్ణంరాజు ఇంట్లో కాలుజారి ప‌డ్డార‌ని కూడా వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కృష్ణంరాజు ఆరోగ్యం బాగుందని అందులో స్ప‌ష్టం చేశారు.

యూకే ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్న నేప‌థ్యంలో కృష్ణంరాజు సాధార‌ణ‌ ప‌రీక్ష‌లు చేయించుకున్నార‌ని, వైద్య ప‌రీక్ష‌ల కోస‌మే ఆసుప‌త్రికి వెళ్లామ‌ని చెప్పారు. అలాగే, యాక్సిడెంట్‌లో గాయాల‌పాలై చికిత్స తీసుకుంటోన్న‌ సాయితేజ్ ఆరోగ్య ప‌రిస్థితిని కూడా కృష్ణంరాజు తెలుసుకున్నారని, ఆయ‌న‌ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కృష్ణంరాజు ఆకాంక్షించారని చెప్పారు.

కాగా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబరు 10న నిర్వహించబోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబ‌రులో 'మా' క్రమశిక్షణా సంఘం ఛైర్మన్‌ కృష్ణంరాజు భారత్‌లో ఉండడం లేదని, దీంతో ఎన్నికల బాధ్యతలు నిర్వహించడానికి పి.శివకృష్ణను నియమించారని ఇప్ప‌టికే న‌రేశ్ ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే కృష్ణంరాజు యూకే వెళ్ల‌నున్నారు.