సాయి ధరమ్ తేజ్ వీడియో బయటకు రావడంపై నిఖిల్‌ ఆగ్రహం!

14-09-2021 Tue 12:45
  • అపోలో ఐసీయూలో చికిత్స పొందుతున్న సాయితేజ్
  • వైరల్ అవుతున్న సాయితేజ్ వీడియో
  • ఐసీయూలోకి కెమెరాలను ఎందుకు అనుమతిస్తున్నారన్న నిఖిల్
Actor Nikhil anger on video of Sai Dharam Tej

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ హీరో సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు సాయితేజ్ ఆసుపత్రిలో ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. సాయితేజ్ ను స్పృహలోకి తెచ్చేందుకు డాక్టర్లు యత్నిస్తున్నట్టుగా వీడియోలో ఉంది. ఓ డాక్టర్ భుజం తడుతుంటే... సాయితేజ్ కాస్త చేయి కదిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు, ఈ వీడియోపై మరో హీరో నిఖిల్ మండిపడ్డాడు. వీడియో బయటకు రావడంపై అసహనం వ్యక్తం చేశాడు. ఐసీయూలోకి కెమెరాలను ఎందుకు అనుమతిస్తున్నారని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించాడు. చికిత్స పొందుతున్న సాయితేజ్ వీడియో ఇలా బయటకు రావడం బాధాకరమని అన్నాడు. వ్యక్తి ప్రైవసీకి గౌరవాన్ని ఇవ్వాలని... కనీసం ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఏకాంతానికైనా గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు.