భ‌ర్త‌తో క‌లిసి తిరుమ‌ల‌ శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న హీరోయిన్ శ్రియ‌.. ఫొటోలు వైర‌ల్

14-09-2021 Tue 12:32
  • ఈ రోజు ఉద‌యం తిరుమ‌లకు శ్రియ‌
  • శ్రియకి ఆమె భ‌ర్త  ఆప్యాయంగా ముద్దు
  • ప్ర‌స్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  సినిమాలో న‌టిస్తోన్న శ్రియ‌
sriya visits ttd

సినీ నటి శ్రియ త‌న భ‌ర్త ఆండ్రీ కొశ్చేవ్‌తో క‌లిసి ఈ రోజు ఉద‌యం తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకుంది. వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న శ్రియ దంపతులకు ఆలయ అర్చకులు తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంత‌రం దంప‌తులు ఆల‌యం బ‌య‌ట ఫొటోల‌కు పోజులు ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా శ్రియకి ఆమె భ‌ర్త ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. క‌రోనా కారణంగా చాలా రోజులుగా శ్రీ‌వారిని దర్శించుకోలేకపోయానని శ్రియ చెప్పింది. ఆ దంప‌తులు దిగిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం శ్రియ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో న‌టిస్తోంది. అలాగే, ‘గమనం’ అనే సినిమాలోనూ న‌టిస్తోంది.