ఇంటర్వ్యూకు వెళ్లిన చెల్లి.. సడెన్‌గా వచ్చి చితక బాదిన అక్క.. కారణం ఏంటంటే?

13-09-2021 Mon 19:47
  • చెల్లిపై ఆగ్రహంతో ఊగిపోయిన అక్క
  • ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లినట్లు తెలిసి ఆఫీసుకు వెళ్లి మరీ దెబ్బలాట
  • భర్తతో ఎఫైర్ పెట్టుకున్నట్లు తెలియడంతోనే
Wife beats her sister during interview know why

ఆమెకు ఉద్యోగం లేదు. తాజాగా ఒక కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. అక్కడ ఇంటర్వ్యూకు వెళ్లింది. అధికారులు ఆమెను రకరకాల ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంతలో ధబేలున ఆ గది తలుపు తెరుచుకుంది. లోపలకు వచ్చిన ఒక యువతి.. ఇంటర్వ్యూలో పాల్గొంటున్న అమ్మాయిపై దాడి చేయడం మొదలు పెట్టింది. ఆమె ఎంత కసిగా కనిపించిందంటే.. చుట్టుపక్కల వాళ్లు వెళ్లి ఆ గొడవ ఆపడానికి కూడా భయపడ్డారు.

ఇక్కడ దెబ్బలాడుకున్న వాళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు కావడం విశేషం. ఇంటర్వ్యూలో ఉన్న చెల్లిపై అక్క దాడి చేయడానికి బలమైన కారణం ఉందండోయ్. తన భర్తతో చెల్లి ఎఫైర్ పెట్టుకున్నట్లు ఈ అక్కకు తెలిసిందట. అందుకే చెల్లి ఏ ఆఫీసులో ఇంటర్వ్యూలో పాల్గొంటుందో తెలుసుకుని మరీ అక్కడకు వచ్చింది. ఆమె కనిపించగానే మీదపడి కొట్టిపారేసింది.

డల్లాస్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అక్క చేసింది కరెక్టే అంటుంటే.. మరికొందరేమో ఇలా ఇంటర్వ్యూలో ఉండగా చెల్లిపై దాడి చేయడం పద్ధతి కాదని అంటున్నారు.