పూజ హెగ్డే డ్రెస్ ధర ఎంతో తెలుసా?

13-09-2021 Mon 18:54
  • పూజ ఎక్కువగా ధరించే బ్రాండ్ అనీతా డోంగ్రే
  • టిన్సెల్ టోస్ బ్రాండ్ ఫుట్‌వేర్
  • ఒక్కో డ్రెస్ ధర రూ.2 లక్షలపైనే!
do you know the cost of pooja hegde dress

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే బాగా పాప్యులర్ అయిన హీరోయిన్స్‌లో ఒకరు. హిందీలో హృతిక్ రోషన్ సరసన కూడా నటించిందీమె. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో భారీ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఎక్కువగా ప్రముఖ బ్రాండ్ అనీతా డోంగ్రే డ్రెస్‌లే ధరిస్తుంది. ఈ బ్రాండ్ ధర సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంటుంది.

ఎందుకంటే ఈ బ్రాండ్ డ్రెస్ ధర.. ఒక్కటి తీసుకుంటేనే కనీసం రూ.2 లక్షలు పలుకుతుంది. దీంతోపాటు ఫుట్‌వేర్ విషయానికొస్తే టిన్సెల్ టోస్ అనే బ్రాండ్‌ను పూజ బాగా ఇష్టపడుతుందిట. ఈ బ్రాండ్ ఫుట్‌వేర్ ప్రారంభ ధరే రూ.2500 ఉంటుంది. అంటే ఈ భామ శరీరంపై ఉండే దుస్తులే రూ.2 లక్షలపైన ధర పలుకుతాయన్నమాట.

అనీతా డోంగ్రే అనే డిజైనర్‌కు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ అంటే మహాఇష్టం. ఈ రంగంలోనే డిగ్రీ చేసిన ఆమె.. రాజస్థాన్ సంప్రదాయ ఎంబ్రాయిడరీ విధానాలనే తన డిజైన్స్‌కు స్ఫూర్తిగా తీసుకుంది. దీంతో ఆమె బ్రాండ్‌కు పాప్యులారిటీ వచ్చింది.

ఈ క్రమంలోనే 2015లో తన పేరుమీదే ముంబైలో ఒక ఫ్యాషన్ హౌస్ మొదలు పెట్టింది. ఇది ప్రస్తుతం సెలెబ్రిటీలకు యమా ఫేవరెట్ బ్రాండ్‌గా మారింది. వీటి ధర డిజైన్‌ను బట్టి ఉంటుంది. ఒక్కో డ్రెస్ లక్షల్లో పలుకుతుంటుంది.