Lakshman Rao: పాతిక నవలలు రాసిన రోడ్డు పక్కన చాయ్ వాలా

Tea seller in Delhi wrote novels in Hindi
  • మహారాష్ట్ర నుంచి ఢిల్లీ చేరిన లక్ష్మణ్ రావ్
  • కుటుంబ పోషణ కోసం టీ షాపు నిర్వహణ
  • హిందీలో నవలలు రాస్తున్న వైనం
  • లక్ష్మణ్ రావ్ మాతృభాష మరాఠీ
ఢిల్లీలో లక్ష్మణ్ రావ్ అనే టీ దుకాణం యజమాని గురించి తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. రోడ్డు పక్కన ఓ చెట్టు కింద చాయ్ అమ్ముకునే ఆయన ఓ రచయిత. ఒకటి రెండు కాదు, హిందీలో ఏకంగా 25 నవలలు రాశారు. అంతజేసీ హిందీ ఆయన మాతృభాష కాదు. మహారాష్ట్ర నుంచి పొట్టచేతబట్టుకుని దేశరాజధానికి చేరిన లక్ష్మణ్ రావ్ హిందీ సాహిత్యాన్ని ఆకళింపు చేసుకున్నారు. కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోనే స్థిరపడిన ఆయన ఓవైపు చాయ్, మరోవైపు తన నవలలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. తీరిక వేళల్లో నవలలు రాస్తూ తన సాహితీ ప్రస్థానం కొనసాగిస్తున్నారు.
Lakshman Rao
Novels
Hindi
Tea Seller
New Delhi
Maharashtra

More Telugu News