అమ్మకాల ఒత్తిడికి గురైన మార్కెట్లు

13-09-2021 Mon 17:04
  • 127 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 13 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా నష్టపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు చివరి వరకు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు నష్టాలబాట పట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 127 పాయింట్లు నష్టపోయి 58,177కి పడిపోయింది. నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయి 17,355 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్;
టీసీఎస్ (1.38%), భారతి ఎయిర్ టెల్ (1.36%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.21%), టాటా స్టీల్ (1.09%), మారుతి సుజుకి (1.05%).

టాప్ లూజర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.22%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.79%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.86%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.78%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.71%).