ఆయనతో ఐదేళ్లు డేటింగ్ చేశా: బాలీవుడ్ నటి నర్గిస్ ఫఖ్రీ

13-09-2021 Mon 14:57
  •  నేను కలిసిన వ్యక్తుల్లో ఉదయ్ గొప్పవాడు
  • రిలేషన్ షిప్ గురించి బయటకు చెప్పొద్దని నాకు చాలా మంది సూచించారు
  • సోషల్ మీడియాలో అనేక తప్పుడు వార్తలు వస్తుంటాయన్న నర్గిస్  
Nargis Fakhri opens up her dating with Uday Chopra

బాలీవుడ్ నటుడు, నిర్మాత ఉదయ్ చోప్రాతో హీరోయిన్ నర్గిస్ ఫఖ్రీ ప్రేమాయణం సాగిస్తోందంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ అంశంపై నర్గిస్ తొలిసారి స్పందించింది. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పందిస్తూ... ఉదయ్, తాను ఐదేళ్లపాటు డేటింగ్ చేశామని వెల్లడించింది. తాను కలిసిన వ్యక్తుల్లో అందిరి కంటే గొప్పవాడు ఉదయ్ అని తెలిపింది.

ఉదయ్ తో ఉన్న అనుబంధం గురించి ఇంతకాలం ఎందుకు స్పందించలేదనే ప్రశ్నకు బదులుగా... తమ అనుబంధం గురించి బయట ప్రపంచానికి వెల్లడించవద్దని తనకు చాలా మంది సూచించారని.. అందుకే ఈ విషయాన్ని ప్రెస్ కు వెల్లడించలేదని నర్గిస్ చెప్పింది. సోషల్ మీడియాలో అనేక తప్పుడు వార్తలు వస్తుంటాయని తెలిపింది. మరోవైపు, వీరిద్దరూ బ్రేకప్ అయ్యారంటూ 2016లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.