సాయితేజ్ కు వెంటిలేటర్ అవసరం క్రమంగా తగ్గుతోంది: అపోలో వైద్యులు

13-09-2021 Mon 14:53
  • సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్
  • సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
  • ఇంకా ఐసీయూలోనే చికిత్స
  • నిన్న సాయితేజ్ కాలర్ బోన్ కు శస్త్రచికిత్స
Saitej still in ICU at Hyderabad Apollo Hospital

సినీ హీరో సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాదు అపోలో ఆసుపత్రి వర్గాలు తాజా బులెటిన్ విడుదల చేశాయి. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు ఆ బులెటిన్ లో వెల్లడించారు. ప్రస్తుతానికి ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. సాయితేజ్ కు వెంటిలేటర్ అవసరం క్రమంగా తగ్గుతోందని వివరించారు.

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయితేజ్ ఓ స్పోర్ట్స్ బైకు నుంచి పడి తీవ్రగాయాలపాలవడం తెలిసిందే. సాయితేజ్ కాలర్ బోన్ విరిగినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. నిన్న అపోలో వైద్యులు సాయితేజ్ కాలర్ బోన్ కు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.