నిన్న ట్యాంక్ బండ్ వ‌ద్ద అద‌ర‌హో అనేలా ఏర్పాట్లు... భారీగా వ‌చ్చిన సంద‌ర్శ‌కులు.. వీడియో ఇదిగో

13-09-2021 Mon 13:34
  • ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు అమలు
  • ట్యాంక్ బండ్ వ‌ద్ద‌కు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేందుకు ఏర్పాట్లు
  • లేజర్ షో, చిన్నారుల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు
Glimpses of Sunday Funday TankBund yesterday

హైద‌రాబాద్ వాసుల‌కు స‌న్ డే-ఫ‌న్ డేగా మారింది. ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే అధికారులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా నిన్న‌ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్యాంక్ బండ్ వ‌ద్ద‌కు ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించేందుకు అధికారులు మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకున్నారు.

నిన్న ఆర్మీ బ్యాండ్ తో పాటు లేజర్ షో వంటి ఏర్పాట్లు చేశారు. చిన్నారులు ఆడుకునేందుకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. ఉచితంగా మొక్క‌లు పంపిణీ చేశారు. దీంతో నిన్న ట్యాంక్ బండ్ వ‌ద్ద‌కు వ‌చ్చిన వారు సరికొత్త అనుభూతిని పొందారు. ట్యాంక్ బండ్ వ‌ద్ద చేసిన ప్ర‌త్యేక ఏర్పాట్లతో ఇక‌పై సంద‌ర్శ‌కుల తాకిడి మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. నిన్న అక్క‌డ చేసిన ఏర్పాట్లకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.