రోడ్డు పక్కన కారు ఆపి.. చిన్న హోటల్‌లో టిఫిన్ తిన్న అల్లు అర్జున్.. వీడియో ఇదిగో

13-09-2021 Mon 13:21
  • పుష్ప షూటింగ్ కోసం గోక‌వ‌రానికి బ‌న్నీ
  • ఖాళీ స‌మ‌యంలో అక్క‌డి ప్రాంతాల‌ను చూస్తోన్న అల్లు అర్జున్
  • టిఫిన్ తిని బిల్లు క‌ట్టి వెళ్లిపోయిన బ‌న్నీ
AlluArjun having breakfast at road side tiffin centre near Gokavaram

సినీ న‌టుడు అల్లు అర్జున్ రోడ్డు పక్కన కారు ఆపి.. చిన్న హోటల్‌లో టిఫిన్ తిన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. అల్లు అర్జున్ నిరాడంబ‌ర‌త‌కు ఇది నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప‌నుల్లో భాగంగా అల్లు అర్జున్ ప‌లువురితో క‌లిసి తూర్పు గోదావరి జిల్లా గోకవ‌రం మీదుగా వెళ్తున్నాడు. ఆ స‌మ‌యంలో రోడ్డు ప‌క్క‌న ఎన్టీఆర్ విగ్ర‌హం వ‌ద్ద‌ చిన్న హోట‌ల్ క‌న‌ప‌డ‌డంతో కారు ఆపి అందులోకి వెళ్లారు. టిఫిన్ చేసిన త‌ర్వాత బిల్ చెల్లించి బ‌న్నీ మ‌ళ్లీ కారు ఎక్కి వెళ్లిపోయాడు.