ఎన్టీఆర్ తో కొరటాల సినిమా మరింత ఆలస్యం?

13-09-2021 Mon 12:03
  • 'ఆర్ ఆర్ ఆర్' పనుల్లో ఎన్టీఆర్
  • 'ఆచార్య' పనుల్లో కొరటాల 
  • పూర్తికాని ఎన్టీఆర్ స్క్రిప్ట్ 
  • మార్పులకు మరింత సమయం  
Koratala and Ntr Combo Update

ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, మరో నిర్మాతగా కల్యాణ్ రామ్ వ్యవహరించనున్నాడు. నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తూ వచ్చింది.

అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మరికొంత సమయం పట్టొచ్చని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే కరోనా కారణంగా ముందుగా వేసుకున్న ప్రణాళికలలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటు కొరటాల చేస్తున్న 'ఆచార్య'.. అటు ఎన్టీఆర్ చేస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' అనుకున్న సమయానికి పూర్తి కాలేదు.

అందువలన ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను కొరటాల ఇంకా పూర్తి చేయలేదట. స్క్రిప్ట్ రెడీ అయిన తరువాత కూడా మళ్లీ మార్పులు .. చేర్పులు ఉంటాయి గనుక, ఈ సినిమా మొదలుకావడానికి మరికొంత సమయం పట్టొచ్చని అంటున్నారు.