చిరంజీవిని చూసి భోరున విలపించిన ఉత్తేజ్

13-09-2021 Mon 11:48
  • క్యాన్సర్ తో ఉత్తేజ్ భార్య కన్నుమూత
  • వార్త వినగానే హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లిన చిరంజీవి
  • ఉత్తేజ్ ను పరామర్శించిన మెగాస్టార్
Uttej went into tears after seeing Chiranjeevi

ప్రముఖ సినీ నటుడు, రచయిత ఉత్తేజ్ భార్య పద్మావతి (48) ఈరోజు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె ... హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ మధ్యాహ్నం మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మరణవార్తతో తెలుగు సినీపరిశ్రమ విషాదంలో ముగినిపోయింది.

పద్మావతి మరణవార్తను వినగానే చిరంజీవి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఉత్తేజ్ ను పరామర్శించారు. చిరంజీవిని చూడగానే ఉత్తేజ్ భోరున విలపించారు. మరోవైపు ప్రకాశ్ రాజ్, జీవిత, బ్రహ్మాజీ తదితరులు కూడా ఉత్తేజ్ ను పరామర్శించారు.