సాయితేజ్ ప్రమాదం గురించి మెగా ఫ్యామిలీలో మొదట ఎవరికి తెలిసిందంటే..?

13-09-2021 Mon 11:14
  • ప్రమాదానికి గురైన వెంటనే మెడికవర్ హాస్పిటల్ కు తేజ్ తరలింపు
  • అల్లు అర్జున్ కి సమాచారం అందించిన హాస్పిటల్ లోని స్నేహితులు
  • తన మేనత్త సురేఖకు ప్రమాదం గురించి తెలిపిన బన్నీ
Who is the first person in Mega family knows about Sai Dharam Tej accident

మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాదులోని అపోలో అసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోంది. మరోవైపు రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే ఆయనను 108 అంబులెన్సులో మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలో తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తొలుత అల్లు అర్జున్ కే తెలిసిందట. మెడికవర్ ఆసుపత్రిలో పని చేస్తున్న అల్లు అర్జున్ స్నేహితులు ఆ విషయాన్ని వెంటనే ఆయనకు తెలియజేశారు. ఆ వెంటనే ఈ విషయాన్ని చిరంజీవి భార్య, మేనత్త అయిన సురేఖకు అల్లు అర్జున్ తెలియజేశాడట. ఈ విషయాన్ని 'పుష్ప' టీమ్ తెలియజేసింది.

ప్రస్తుతం కాకినాడలో ఈ సినిమా షూటింగులో బన్నీ బిజీగా ఉన్నాడు. తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. తేజ్ గురించి బన్నీ ఒక్క ట్వీట్ కూడా చేయలేదనే ట్రోలింగ్ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే 'పుష్ప' టీమ్ స్పందిస్తూ ఈ వివరాలను తెలియజేసింది. మరోవైపు, 'మా కుటుంబం గురించి మేమే ట్వీట్లు చేసుకోవడం ఏమిటని' బన్నీ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.