Uttej: సినీ నటుడు ఉత్తేజ్ భార్య కన్నుమూత

Actor Uttej wife dead
  • బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో కన్నుమూసిన పద్మావతి
  • కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పద్మావతి
  • పద్మావతి మృతి పట్ల సంతాపం ప్రకటించిన సినీ ప్రముఖులు
సినీ నటుడు, రచయిత ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య పద్మావతి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆమె క్యాన్సర్ తో బాధపడుతున్నారు. హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 48 సంవత్సరాలు.

ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఉత్తేజ్ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నారు. ఉత్తేజ్ కు ఆయన భార్య అన్ని విధాలుగా అండగా ఉండేవారు. ఆయనకు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ ను ఆమె నిర్వహించేవారు. ఉత్తేజ్ పెద్ద కుమార్తె చేతన 2017లో వెండి తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం మహాప్రస్థానంలో పద్మావతి అంత్యక్రియలు జరగనున్నాయి.
Uttej
Wife
Dead
Tollywood

More Telugu News