డ్రగ్స్ కేసు.. కాసేపట్లో ఈడీ ముందుకు నవదీప్, ఎఫ్ క్లబ్ మేనేజర్

13-09-2021 Mon 10:17
  • ఎఫ్ క్లబ్ కు యజమాని నవదీపే
  • విచారణకు హాజరు కావాలంటూ కెల్విన్ కు ఈడీ ఆదేశం
  • ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్న ఏడుగురు సినీ ప్రముఖులు
Actor Navdeep to face ED enquiry today in drugs case

టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ఈరోజు హీరో నవదీప్, ఎఫ్ క్లబ్ పబ్ మేనేజర్ విచారణకు హాజరుకానున్నారు. ఎఫ్ క్లబ్ పబ్ యజమాని నవదీప్ కావడం గమనార్హం. ఈ పబ్ లో తరచుగా సినీ ప్రముఖులకు పార్టీలు నిర్వహించేవారని సమాచారం. ఈ పార్టీల్లో డ్రగ్స్ వినియోగించేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పార్టీలకు ఈ కేసులో కీలక నిందితులైన కెల్విన్, జీషాన్ లు హాజరయ్యేవారనే విషయం గతంతో ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది.

మరోవైపు ఈరోజు విచారణకు హాజరుకావాలంటూ కెల్విన్ ను కూడా ఈడీ అధికారులు ఆదేశించారు. ప్రధానంగా మనీ లాండరింగ్ అంశంపైనే విచారణ జరగనుంది. ఇప్పటి వరకు ఏడుగురు సినీ ప్రముఖులు విచారణను ఎదుర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన ముమైత్ ఖాన్, 17న తనీశ్, 22న తరుణ్ విచారణకు హాజరుకానున్నారు.