కొత్త లగ్జరీ కారు కొన్న రామ్ చ‌ర‌ణ్‌.. వీడియో ఇదిగో!

13-09-2021 Mon 09:51
  • ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించుకున్న చెర్రీ
  • మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్‌ 600 కారును డెలివ‌రీ చేసిన సంస్థ‌
  • ఇటీవ‌లే కొత్త కారు కొన్న‌ ఎన్టీఆర్
ram charan receives his new car

సినీ న‌టుడు రామ్ చ‌రణ్ ఇటీవ‌ల కొన్న అత్యంత ఖ‌రీదైన కారు ఆయ‌న ఇంటికి డెలివ‌రీ అయింది. ఈ కారును ఆయ‌న త‌న‌కు న‌చ్చిన‌ట్టుగా డిజైన్ చేయించుకున్నాడు. కారు డెలివ‌రీ అయిన సంద‌ర్భంగా ఆయ‌న ఓ వీడియో తీసుకున్నాడు. ఈ బ్లాక్ కలర్ మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్‌ 600 కారును రామ్ చరణ్ కాసేపు డ్రైవ్ చేశాడు.

ఈ కారు ధర దాదాపు రెండున్నర కోట్లు ఉంటుందని తెలుస్తోంది. కారును ఆయ‌న‌కు అందించిన కంపెనీ సిబ్బంది ఈ సంద‌ర్భంగా ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. కాగా, ఇటీవ‌లే సినీన‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా అత్యంత ఖ‌రీదైన లంబోర్ఘిని ఉరుస్ కారును కొన్న విష‌యం తెలిసిందే. సినీన‌టుడు శ్రీ‌కాంత్, వైస్సార్సీపీ నేత సునీల్ కుమార్ చ‌ల‌మ‌ల‌శెట్టితో క‌లిసి ఎన్టీఆర్ ఆ కారుతో దిగిన ఫొటో ఇటీవ‌ల బాగా వైర‌ల్ అయింది.