బలరాముడు చూపిన బాటలోనే అమరావతి రైతుల దీక్ష: భారతీయ కిసాన్ సంఘ్ నేత కుమారస్వామి

13-09-2021 Mon 08:47
  • ఆదివారానికి 635వ రోజుకు చేరుకున్న దీక్ష
  • బలరాముడి జయంతిని పురస్కరించుకుని పూజలు
  • అంతిమ విజయం రైతులదేనన్న కుమారస్వామి
Amaravati farmers will win end of the day said kumaraswamy

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన నిరసన నిన్నటికి 635వ రోజుకు చేరుకుంది. ఆదివారం బలరాముడి జయంతిని పురస్కరించుకుని తుళ్లూరులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు.

ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ నాయకుడు కుమారస్వామి మాట్లాడుతూ.. అమరావతి రైతులు, మహిళల దీక్షకు బలరాముడే ఆదర్శమని అన్నారు. ఎప్పటికైనా ధర్మానిదే విజయమని మహాభారత యుద్ధ సమయంలో బలరాముడు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన చూపిన మార్గంలోనే రైతులు ముందుకు వెళుతున్నారని అన్నారు. విజయం చివరికి వారికే సిద్ధిస్తుందన్నారు. పార్టీలు, ప్రాంతాలు, కులమతాలను పక్కనపెట్టి అమరావతి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.