సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

13-09-2021 Mon 07:33
  • వెబ్ సీరీస్ కి ఓకే అంటున్న నాయిక 
  • కాకినాడ పోర్టులో 'పుష్ప' షూటింగ్
  • వచ్చే నెలలో 'ఏడడుగుల బుల్లెట్'  
Nabha Natesh ready for web series

*  తాజాగా నితిన్ సరసన 'మాస్ట్రో' చిత్రంలో నటించిన కథానాయిక నభా నటేష్ వెబ్ సీరీస్ లో కూడా నటించడానికి సై అంటోంది. ''మంచి కథలు వస్తే వెబ్ సీరీస్ చేయడానికి నాకు అభ్యంతరం లేదు. సినిమాలు చేస్తూనే అవి కూడా చేస్తాను. ఎక్కడైనా సరే వైవిధ్యమైన పాత్రలు మాత్రమే చేయాలని వుంది" అని చెప్పింది.
*  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' చిత్రం షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్టులో జరుగుతోంది. మరో వారం రోజుల పాటు ఈ షెడ్యూలు అక్కడ కొనసాగుతుంది. కాగా, రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం తొలి పార్టును డిసెంబర్ 17న విడుదల చేయడానికి నిర్ణయించినట్టు తాజా సమాచారం.
*  గోపీచంద్, నయనతార జంటగా బి.గోపాల్ దర్శకత్వంలో ఏడేళ్ల క్రితం రూపొందిన 'ఏడడుగుల బుల్లెట్' చిత్రాన్ని విడుదల చేయడానికి కొన్నాళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చాయని, వచ్చే నెలలో చిత్రాన్ని రిలీజ్ చేస్తారనీ తెలుస్తోంది.