బంగాళాఖాతంలో మరింత బలపడిన అల్పపీడనం.. తెలంగాణకు అతి భారీ వర్ష సూచన

12-09-2021 Sun 21:11
  • పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
  • 7.6 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం
  • మూడ్రోజుల పాటు తెలంగాణలో అతిభారీ వర్షాలు
  • రేపటికి వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం
Heavy rain alert for Telangana

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. దానికితోడు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా మూడ్రోజుల పాటు అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.

కాగా, రానున్న 12 గంటల్లో తీవ్ర అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.