డ్రగ్స్ కేసులో రేపు నవదీప్ ను విచారించనున్న ఈడీ అధికారులు

12-09-2021 Sun 19:46
  • టాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహారం
  • డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ కోణం
  • తాజాగా ఈడీ దర్యాప్తు
  • ఇప్పటికే ఏడుగురు సినీ ప్రముఖులను విచారించిన ఈడీ
ED Officials will question Navdeep tomorrow

టాలీవుడ్ లో ప్రకంపనలు రేపిన డ్రగ్స్ కేసులో ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. రేపు నటుడు నవదీప్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు. నవదీప్... ఈ కేసులో గతంలో ఎక్సైజ్ అధికారుల విచారణకు కూడా హాజరయ్యాడు. తాజాగా ఈడీ అధికారులు మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి నవదీప్ ను ప్రశ్నించనున్నారు. డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్ తో లావాదేవీలపై ఈడీ ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ కు సంబంధించి ఈడీ ఇప్పటికే ఏడుగురు సినీ ప్రముఖులను విచారించింది.