యూనివర్సిటీలు క్రమం తప్పకుండా స్నాతకోత్సవాలు నిర్వహించాలి: గవర్నర్ బిశ్వభూషణ్

12-09-2021 Sun 17:08
  • స్నాతకోత్సవాలు జరపకపోవడంపై అసంతృప్తి
  • ఏటా స్నాతకోత్సవాలు జరపాలని గతంలోనే ఆదేశాలు
  • కొన్ని వర్సిటీల్లో జాప్యం జరుగుతోందన్న గవర్నర్
  • మరోసారి ఉన్నత విద్యామండలి చైర్మన్ కు ఆదేశాలు
Governor Biswabhushan Harichandan insists on University Convocations

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ యూనివర్సిటీల స్నాతకోత్సవాలపై స్పందించారు. విశ్వవిద్యాలయాలు క్రమం తప్పకుండా స్నాతకోత్సవాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులకు ముందు మూడు, నాలుగేళ్లకు ఒకసారి స్నాతకోత్సవాలు నిర్వహించేవారని, ఏటా స్నాతకోత్సవాలు జరపాలని గతంలోనే వీసీలను ఆదేశించామని వెల్లడించారు. అయితే, కొన్ని వర్సిటీల్లో ఇప్పటికీ జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

కొవిడ్ దృష్ట్యా భౌతికంగా వీల్లేకున్నా, వర్చువల్ గా జరపాలని తాజాగా ఆదేశించారు. ఇకపై ఏటా స్నాతకోత్సవాలు జరపాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ కు స్పష్టం చేశారు.