సాయితేజ్ త్వరగా కోలుకోవాలంటూ మోకాళ్లపై ద్వారకా తిరుమల మెట్లు ఎక్కిన అభిమానులు

12-09-2021 Sun 15:13
  • సాయితేజ్ కు రోడ్డు ప్రమాదం
  • హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • ఆలయాల్లో అభిమానుల ప్రత్యేక పూజలు
  • సాయితేజ్ క్షేమంగా ఉండాలంటూ ప్రార్థనలు
Fans offers prayers in Temples for Saitej health

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హీరో సాయితేజ్ హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, సాయితేజ్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రంలో సాయితేజ్ అభిమానులు మోకాళ్లపై మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకున్నారు. మెగాహీరో ఆరోగ్యవంతుడై తిరిగి రావాలని ప్రార్థించారు. సాయిధరమ్ తేజ్ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

అటు, విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయంలోనూ, రాజమండ్రిలోని సూర్యభగవానుడి ఆలయంలోనూ అభిమానులు పూజలు చేశారు. తమ హీరో క్షేమంగా ఉండాలంటూ ప్రార్థించారు.