Tollywood: రండి.. విందు చేద్దాం.. సమస్యలపై చర్చిద్దాం: సినీ కళాకారులకు ప్రకాశ్​ రాజ్​ మెసేజ్​!

Prakash Raj Invites Cine Industry Artists To Discuss Problems
  • ‘మా’ ఎన్నికల్లో వేగం పెంచిన నటుడు
  • ఓ ప్రముఖ హోటల్ లో విందు ఏర్పాటు
  • అందరికీ ఆహ్వానం పంపించిన ప్రకాశ్ రాజ్ టీమ్
సినీ పరిశ్రమలోని కార్మికుల సమస్యల గురించి చర్చించేందుకు ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన ఆయన.. ప్రచారంలోకి దిగేశారు. ఇప్పటికే అభ్యర్థులంతా ఎవరికివారు గెలుపు కోసం విందులు ఇచ్చారన్న వార్తలూ వెలువడ్డాయి. తాజాగా సినీ కళాకారుల సమస్యల గురించి తెలుసుకునేందుకు వారితో ప్రకాశ్ రాజ్ సమావేశమైనట్టు తెలుస్తోంది.

ఇవాళ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో వారందరికీ ఆయన విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ‘‘అందరం మాట్లాడుకుందాం. మా లక్ష్యాలపై చర్చిద్దాం. అందరం కలిసి విందు చేద్దాం’’ అంటూ ఓ ఆహ్వాన సందేశాన్ని సినీ కళాకారులకు ప్రకాశ్ రాజ్ టీమ్ పంపినట్టు తెలుస్తోంది.
Tollywood
MAA
Prakash Raj
Problems
Elections

More Telugu News